Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
- ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్..
- రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’..
- ఆరు నెలల్లో రెండు సార్లు సరెండర్ అయిన పాక్..
- సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘాన్ దాడులు తట్టుకోలేక, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను రెండు దేశాల మధ్య మిడియేషన్ చేయాలని, ఆఫ్ఘాన్ దాడులు ఆపేలా చేయాలని పాకిస్తాన్ కోరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Also: Maoist Surrender: మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..
Also Read
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య శతాబ్ధానికి పైగా ఉంది. రెండు దేశాల మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ ఈ ఘర్షణలకు మూలంగా మారింది. పాకిస్తాన్ ఈ సమస్యను ‘‘సంక్లిష్టమైన కానీ పరిష్కరించగల సమస్య’’గా అభివర్ణించింది. దీనికి సానుకూల పరిష్కారం కనుగొనడానికి నిజాయితీగా ప్రయత్నించడానికి రెండు వైపుల అంగీకారం కుదిరింది అని చెప్పింది. దౌత్యపరమైన సంభాషణలు, శత్రుత్వాన్ని నిలిపేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు పాక్ చెప్పింది.
నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పోరాటాన్ని ఆపేయాలని, ‘‘అల్లాహ్ కే వాస్తే(దేవుడి కోరకు)’’ దాడుల్ని ఆపేయాలని తమను కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారి అబ్దుల్ హక్ హమద్ చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో పాకిస్తాన్ రెండోసారి సరెండర్ అయింది. అంతకుముందు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహిస్తే, నాలుగు రోజుల్లోనే పాక్ చేతులు ఎత్తేసి, శాంతి జెండాను ఎగురవేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?