Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఇవాళే ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. మరోవైపు.. జాతినుద్దేశించి ప్రసగించిన ఇమ్రాన్ ఖాన్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. దేశవ్యాప్తంగా ఆదివారం భారీ నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
Read Also: YS Jagan: దూకుడు పెంచిన ఏపీ సీఎం.. వ్యూహం మారిందా..?
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
ఇక, మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హిందుస్థాన్ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనైన ఆయన.. భారత్‌లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్‌ను నిస్వార్థ దేశంగా అభివర్ణించిన ఆయన.. భారత స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్‌పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని పేర్కొన్నారు.. భారతదేశానికి ప్రపంచంలో ఎంతో గౌరవం ఉందని కొనియాడిన పాక్ ప్రధాని.. కానీ, పాకిస్థాన్ ఒక బానిస దేశమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి తాను ఇచ్చిన సలహా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపక్షాల నేతలు అమ్ముడుపోయారని ఆరోపించిన ఆయన.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు.. 4 నెలల క్రితమే అమెరికా కుట్రలు ప్రారంభించిందని… అమెరికా.. పాకిస్థాన్ రాయబారిని బెదిరించిందన్న ఇమ్రాన్.. తనను తొలగించాలని అమెరికా కోరిందని.. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మొత్తం ప్లాన్ జరిగిందన్నారు.. కానీ, తాను ఎవరికీ కీలుబొమ్మను కాలేనని.. తనకు విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు లేదని అన్నారు. ప్రతిపక్షం డబ్బు కోసం దేశాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో 172 మంది సభ్యుల మద్దతు ఉంటే ఇమ్రాన్‌ను ఓడించవచ్చు.. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును చూపించారు. దీంతో.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాసంలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు.. అదే జరిగితే.. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!