Site icon NTV Telugu

Pakistan PM: మారని పాక్ పీఎం.. భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!

Shehbaz Sharif

Shehbaz Sharif

Pakistan PM: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. కానీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అసత్య ప్రచారంతో అక్కడ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇండియాపై విజయం సాధించామంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కరాచీలో పర్యటించిన సందర్భంగా అతడు మాట్లాడుతూ.. పాకిస్తాన్ నావికాదళం, వైమానిక దళాన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారు.. ఇండియన్ నౌవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు దగ్గరగా వచ్చింది.. మన దేశానికి కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.. కానీ, విక్రాంత్ పై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసి తీవ్రంగా నష్టం కలిగించిందని అబద్దపు మాటలు చెప్పుకొచ్చారు షెహబాజ్ షరీఫ్.

Read Also: Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ట్రంప్ ప్రకటన తర్వాత జెలెన్‌స్కీ వ్యాఖ్య

అయితే, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ కి చెందిన క్షిపణులు దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. అలాగే, సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత సైన్యం ప్రకటించింది. మరోవైపు, పాక్ మాత్రం ప్రజల నివాస ప్రాంతాల పైనే డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కానీ, వాటిని ఇడియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన ఐదు ఎయిర్ బేస్ క్యాంపులపై దాడి చేయడంతో.. దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. దీంతో భారత్ తో కాల్పుల విరమణ చేసుకుంది పాకిస్తాన్.

Exit mobile version