NTV Telugu Site icon

Pakistan: భారత్‌తో వాణిజ్య సంబంధాల కోసం పాకిస్తాన్ ఆరాటం..

Pakistan

Pakistan

Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాపారవేత్తలు భారత్‌తో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!

తాజాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై తమ దేశం సీరియస్‌గా దృష్టిసారించిదని అన్నారు. శనివారం లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ వ్యాపారవేత్తలు భారత్‌తో వాణిజ్యాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, పొరుగుదేశంతో సంబంధాల పునరుద్ధరణపై ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాక్ మంత్రి వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు.

గత నెల ప్రారంభంలో పాకిస్తాన్‌కి కొత్త ప్రధానిగా రెండోసారి షెహజాబ్ షరీఫ్ ప్రమాణస్వీకరాం చేశారు. ప్రధాని మోడీ అతనికి శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ప్రతిగా షెహబాజ్ షరీఫ్ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రస్తుతం భారత్‌తో సంబంధాలు చాలా కీలకం. ప్రమాణస్వీకార సమయంలో పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జీ20 దేశాల జాబితాలో చేరడంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం తన ముందున్న కీలక లక్ష్యాలని చెప్పారు.