Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- పాకిస్తాన్లో ‘‘ఔషధ సంక్షోభం’’..
- అందుబాటులో లేని మెడిసిన్స్..
- ప్రధాన నగరాల్లో ఇదే సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Medicine Crisis: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు ఆ దేశాన్ని ‘‘మెడిసిన్ సంక్షోభం’’ భయపెడుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల ఓ పక్క ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలోనే, ప్రాణాలు కాపాడే ఔషధాలు ఇప్పుడు పాకిస్తాన్లో కనిపించడం లేదు. పిండి, నూనె, గ్యాస్ ఇలా నిత్యావసర సరుకుల కొరత ఎదుర్కొంటున్న దాయాది, ఇప్పుడు ‘‘ఔషధ సంక్షోభం’’ లో ఉంది.
ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం పాకిస్తాన్‌ను ఇబ్బంది పెడుతోంది. దేశంలో ఇంధన ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. లాహోర్, కరాచీ, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. రోగులకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో లేవు. మరోవైపు మందుల ధరలు తీవ్రంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Read Also: BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
నివేదికల ప్రకారం.. 2023 నుంచి పాకిస్తాన్ మెడిసిన్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2024లో సుమారు 50 శాతం, 2025లో 30-40 శాతం పెరిగాయి. 2026లో మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఈ పెరుగుదల మరింత వేగమైంది. ఇదే సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై 18 శాతం పన్ను విధించడంతో మెడిసిన్స్ ధరలు మరింత పెరిగాయి. పాకిస్తాన్లో అమ్ముడయ్యే మందుల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఈ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలతో పాకిస్తాన్లో కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారక నిల్వలు తగ్గడం, కరెన్సీ పతనం వంటి సమస్యల్ని ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!