Site icon NTV Telugu

Pakistan: 15 రోజుల శిశువును బ్రతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి..!

Pak

Pak

Pakistan: 15 రోజుల వయసున్న నవజాత శిశువును బ్రతికి ఉండగానే ఓ తండ్రి ఖననం చేశాడు. బిడ్డ ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు నిందితుడిని తయ్యబ్‌గా గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థికభారంగా మారడంతో ఈ పని చేశానంటూ బోరున విలపించాడు. చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతి పెట్టినట్టు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. కాగా, కోర్టు ఆదేశాల ప్రకారం, చిన్నారి మృతదేహాన్ని వెతికి తీసి పోస్ట్‌మార్టం కోసం హస్పటల్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

Read Also: మీరు రోజూ లేట్గా నిద్రపోతున్నారా.. అయితే మీకు మానసిక సమస్యలు వచ్చే ఛాన్స్..!

అయితే, లాహోర్‌ రాష్ట్రంలోని డిఫెన్స్ ఏరియాలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఓ జంట.. ఇంటి పని కోసం సహాయకురాలిగా నియమించుకున్న 13 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేశారు. టీనేజర్ దుస్తులు తొలగించి శారీరకంగా విపరీతంగా టార్చర్‌కు గురి చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు హసమ్‌పై డిఫెన్స్ ఏరియా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నిందితుడు హసన్ ను అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Exit mobile version