Iran-Israel War:: ఇరాన్-ఇజ్రాయిల్ వార్‌లోకి పాక్ ఎంట్రీ ఇస్తుందా?

Iran War (2)

Iran War (2)

Iran-Israel War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు తీవ్రం అవుతున్నాయి. ఏకంగా 5000 బాంబులతో ఇజ్రాయిల్ ఇరాన్‌లో బాంబుల వర్షాన్ని కురిపించింది. మరోవైపు, ఇరాన్ తన ప్రతీకార దాడుల్ని కొనసాగిస్తోంది. యూఏఈ, కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియాలపై విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడులు చేయడంతో పాటు కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తోంది.

Read Also: Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు కారణంగా సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులే. పాక్-సౌదీల మధ్య సైనిక ఒప్పందం కారణంగా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. సౌదీపై ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులు చేస్తోంది. సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (SMDA) ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే అది తమ దేశంపై జరిగే దాడిగా గుర్తించి ప్రతిదాడి చేస్తామని గతంలో పాకిస్తాన్ తెలిపింది.

ఇటీవల సౌదీపై ఇరాన్ దాడిని పాక్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ ఖండించారు. సౌదీపై దాడులు ఆపాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతానికి పాక్ మంత్రి హెచ్చరిక మాత్రమే ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్తులో సౌదీపై ఇరాన్ దాడులు తీవ్రమైతే, యుద్ధంలోకి పాక్ దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.