NTV Telugu Site icon

Pakistan Economic Crisis: పాక్ ప్రజలపై పన్నుల మోత.. లగ్జరీ వస్తువుల, దిగుమతులపై భారీగా పన్నులు

Pakistan

Pakistan

Pakistan Economic Crisis:రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభం దాయాది దేశం పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఏకంగా పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని వ్యాఖ్యానించడం చూస్తే ఆ దేశ పరిస్థితి ఏంటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో చర్చలు నిర్వహించింది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందంపై స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ షరతుల్లో భాగంగా ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేసేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్, విద్యుత్ పై పన్నులను పెంచింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ ఎప్పుడో 250 రూపాయలు దాటింది. ప్రస్తుతం పాకిస్తాన్ విలాసవంతమైన వస్తువులు, దిగుమతులు, సేవలపై పన్నులను భారీగా పెంచింది. దీనికి సోమవారం ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తక్కువ విదేశీమారక నిల్వలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే దిగుమతులను నిలిపేసింది. ఆహారం, ఔషధాలు కాకుండా ఇతర దిగుమతులపై పన్నులను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.

Read Also: Jharkhand: లవర్‌తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం

రాజకీయ అస్థిరత, ఆర్థిక క్రమశిక్షణ, 2022 భారీ వరదల కారణంగా పాకిస్తాన్ దారుణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీమారక నిల్వలు కనీసం అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోవడం లేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్ లో ఎన్నికలు జరగనుండటంతో ప్రజలపై పన్నులు మోపేందుకు పాక్ ప్రభుత్వం వెనకాడుతోంది. తాజాగా కార్లు, గృహోపకరణాల నుంచి చాక్లెట్లు, సౌందర్య సాధనాల వరకు దిగుమతులపై 17 నుంచి 25 శాతానికి అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బిజినెస్ క్లాస్ విమానప్రయాణాలు, కళ్యాణ మండాపాుల, మొబైల్ ఫోన్లు, సన్ గ్లాసెస్ కొనాలంటే ఇక ప్రజలు మరింతగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ సెల్స్ టాక్స్ 17 శాతం నుంచి 25 శాతానికి పెంచారు.

ఐఎంఎఫ్ 6.5 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలో తరువాత విడత విడుదల కోసం పాకిస్తాన్ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ సాయం ఒక్కటే సరిపోదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే మిత్రదేశాలు చైనా, సౌదీ అరేబియా, యూఏఈ సహకరించాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది.

Show comments