NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ల డాలర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా PIAని విక్రయించాలని అనుకుంటోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఐఎంఎఫ్, PIAని ప్రైవేటీకరించాలని పట్టుబడుతోంది.

దీంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ సర్కార్ దీనిని ఎవరైనా కొంటారా..? అని వెతకడం ప్రారంభించింది. పాక్ ప్రభుత్వం PIAలో 60 శాతం వాటా కోసం ప్రభుత్వ కనీస ధర 85 బిలియన్ పాకిస్తానీ రూపాయలు(సుమారుగా రూ. 250 కోట్లు)గా నిర్ణయించింది. అయితే, చివరగా ఒక బిడ్డర్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్లూ వరల్డ్ సిటీ ప్రభుత్వం అడిగిన ధరలో 8 శాతం అంటే కేవలం రూ. 30 కోట్లు బిడ్డింగ్ చేసింది.

Read Also: Seethakka: స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..

ఇటీవల బిడ్డింగ్ ప్రక్రియను పారదర్శకత తీసుకురావడానికి పాక్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ వేలం జరిగింది. పీటీవీ దీనిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆఫర్ చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం భావించడంతో చివరికి బిడ్ తిరస్కరించబడింది. సేల్ విఫలమైన తర్వాత, తన బిడ్ తిరస్కరణకు గురైతే పాక్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని బ్లూ వరల్డ్ సిటీ చైర్మన్ సాద్ నజీర్ వ్యాఖ్యానించాడు.

ఎయిర్‌లైన్ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు 152 బిలియన్ పాకిస్తానీ రూపాయలు (దాదాపు రూ. 450 కోట్లు). అయితే దీనికి 1 బిలియన్ రూపాలయ అప్పులు కూడా ఉన్నాయి. విదేశీ కొనుగోలుదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్, PIAని స్వాధీనం చేసుకుని, దానిని ‘ఎయిర్ పంజాబ్’గా రీబ్రాండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది, అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంటు నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.