pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయాల్లో 237.5కు చేరింది. ఇదిలా ఉంటే లీటర్ డిజిల్ ధరను పీకేఆర్ 4.25కి తగ్గించింది. కిరోసిన్ ధరను పీకేఆర్ 8.30కి తగ్గించింది.
Read Also: S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార`ం ఉంది!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో శ్రీలంక అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మన మిత్రులు కూడా పాకిస్తాన్ దేశాన్ని అడుక్కునే దేశంగా భావిస్తున్నారంటూ.. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితి చూపాయి. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల సంభవించిన వరదలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింతగా దెబ్బతీసింది. అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతుంది. ఈ వరదల్లో 1500 మందికి పైగా ప్రజలు మరణించారు. 3.3 కోట్ల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. సింధు ప్రావిన్సు, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంక్వాలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) రోడ్డుకూడా చాలా ప్రాంతాల్లో ధ్వంసం అయింది.
పూర్తిగా వరదల ప్రభావం తగ్గడానికి రెండు నుంచి ఆరు నెలలు పడుతుందని.. ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న చైనా కూడా పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. సీపెక్ కింద అభివృద్ధి ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చైనా, పాకిస్తాన్ ను కోరుతోంది. గతంలో పాకిస్తాన్ ను అదుకున్న యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.