Pakistan: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్..

  • ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిగా పాకిస్తాన్..
  • హై లెవల్ సమావేశానికి ముందు కాలు జారిన పాక్ విదేశాంగ మంత్రి..
  • వైరల్ అవుతున్న ఇషాక్ దార్ వీడియో..
Pakistan

Pakistan

Pakistan: ఇరాన్ యుద్ధం ఆపేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా పనిచేస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్‌తో సహా ఈజిప్ట్, టర్కీ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌కు వెళ్లారు. వీరికి పాకిస్తాన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

Read Also: Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఏప్రిల్ 1వ తేదీనా, 2వ తేదీనా..?

పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆదివారం రోజున ఈ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం గురించి చర్చించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీకి స్వాగతం పలుకేందుకు వెళ్తుండగా ఇషాక్ దార్ కాలు జారిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో, ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమం ప్రారంభమైన వెంటనే ఈ సంఘటన జరిగింది. హ్యాండ్ షేక్ ఇవ్వడానికి దార్ వెళ్తున్న సమయంలో కాలు జారి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను పైకి లేపారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.