Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఏప్రిల్ 1వ తేదీనా, 2వ తేదీనా..?
- ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి..
- ఏప్రిల్ 1 లేదా 02, ఏ రోజున పండగ అని సందేహం..
- హనుమాన్ జయంతి పూజా విధానం, మంచి ముహూర్తాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Jayanti: హిందువుల పవిత్ర పండగల్లో ఒకటైన ‘‘హనుమాన్ జయంతి’’ వస్తోంది. అంజనీ పుత్రుడైన హనుమమంతుడు చైత్ర శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారని నమ్ముతారు. ఈ రోజునే ‘‘హనుమాన్ జయంతి’’ని జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఆంజనేయుడికి పూజలు చేసి, ఆయనను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు. రామ భక్తుడైన హనుమాన్‌ను పూజిస్తే ఆరోగ్యం, విజయం దక్కుతాయని, సకల భయాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు ఉపవాసం ఉండి హనుమంతుడికి పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
హనుమాన్ జయంతి ఎప్పుడు..?
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
హనుమాన్ జయంతి ఎప్పుడు అనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఈ ఏడాది చైత్ర శుక్ల పక్ష పౌర్ణమి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7.06 గంటల నుంచి ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 7.41 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి కారణంగా హనుమాన్ జయంతిని ఏప్రిల్ 02వ తేదీన గురువారం జరుపుకుంటారు.
హిందూ పంచాంగం ప్రకారం ‘ఉదయ తిథి’ అనేది పండగలు, వ్రతాల తేదీలను నిర్ణయించడంలో కీలకమైన అంశం. సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే అమలులో ఉంటుందో ఆ రోజంతటికి అదే తిథిగా పరిగణిస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 02 సూర్యోదయానికి ముందు పూర్ణిమ తిథి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 02వ తేదీనే హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
ఈ సమయాలు పూజకు ఎంతో విశిష్టం:
భక్తులు బ్రహ్మ ముహూర్తం, అభిజిత్ ముహూర్తంలో పూజలు చేయాలనుకుంటే, అక్టోబర్ 02 హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 4.38 గంటల నుంచి 5.24 గంటల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 నుండి 12:50 వరకు ఉంటుంది.
ఈ ఏడాది హనుమాన్ జయంతి రోజున ధ్రువయోగం, హస్త నక్షత్రం కలయితో వస్తోంది. ధ్రువ యోగం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 2.20 గంటల వరకు ఉంటుంది. దీని తర్వాత వ్యాఘాట యోగం ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రం సాయంత్రం 5.38 గంటల వరకు ఉంటుంది.
హనుమాన్ జయంతి పూజా విధానం:
హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి, ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఉపవాసంతో పూజ చేయాలి. ఒక చెక్క పీఠంపై ఎర్రటి లేదా తెల్లటి వస్త్రాలు ఉంచి, దానిపై హనుమాన్ ప్రతిమను ప్రతిష్టించాలి. నెయ్యితో దీపం అగరబత్తులు వెలిగించాలి. హనుమంతుడికి ఎర్ర కుంకుమ, చందనం, మల్లె నూనె సమర్పించాలి. ఆంజనేయుడికి పంచామృతం, లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్‌కు హారతి ఇవ్వాలి. మంత్రాలు జపించాలి.
వ్యాధుల నుంచి రక్షణ కోసం ‘‘ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా.’’, శత్రువులు, ఆటంకాల నుంచి విముక్తి కోసం ‘‘ఓం హుం హనుమంతే రుద్రాత్మకాయ హుం ఫట్.’’, వృత్తిలో విజయం కోసం ‘‘ఓం హ్రామ్ హనుమతే నమః’’ అనే మంత్రాలను జపించాలి.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!