Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. అయితే, ఈసారి యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ 13,000 మంది సైనికులను, యుద్ధ విమానాలను పంపింది. గతేడాది ఈ రెండు దేశాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కింద భద్రతను పెంచడానికి పాకిస్థాన్ యుద్ధ విమానాలను మరియు ఇతర సైనిక బలగాలను సౌదీ అరేబియాకు పంపిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు, సహాయక విమానాలు దేశంలోని తూర్పు ప్రావిన్స్‌లో ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని సౌదీ అరేబియా వెల్లడించింది.
Read Also: Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..
సౌదీ చెబుతున్న దాని ప్రకారం.. ఉమ్మడి రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి మద్దతు ఇవ్వడమే పాకిస్తాన్ మోహరింపు లక్ష్యమని చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక సౌదీ పౌరుడు మరణించిన తర్వాత విమానాలను మోహరించినట్లు పాకిస్తాన్ అధికార వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో జరిగబోయే ఏవైనా దాడుల నుంచి సౌదీని రక్షించడంలో ఇస్లామాబాద్ సహాయం చేస్తుందనే భరోసా ఇవ్వడానికే పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సౌదీ, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2025లో ఒక పరస్పర రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా, అది రెండు దేశాలపై దాడి జరినట్లు భావిస్తామని చెప్పాయి. పాకిస్తాన్ సౌదీ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తుంది. మరోవైపు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు సౌదీ సహాయం చేస్తోంది.
