Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ విమానానికి పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్ నో
- బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో నిర్మితమవుతున్న తొలి అణు విద్యుత్ కేద్రం రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం రష్యా నుంచి రావాల్సిన న్యూక్లియర్ ఫ్యూయల్ సరఫరాను అడ్డుకుంది. ఈ ఇంధనాన్ని తీసుకెళ్లున్న రష్యా విమానానికి పాకిస్తాన్ తన గగనతలం(ఎయిర్ స్పేస్)ను మూసేసింది. దీంతో ఈ షిప్మెంట్ ఆలస్యమైంది.
రూప్పూర్ ప్రాజెక్టును రష్యాకు చెందిన ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోటాసామ్ నిర్మిస్తోంది. ఫ్యూయర్ డెలివరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతే ఎయిర్‌స్పేస్ క్లియరెన్స్ సమస్య ఎదురైందని బంగ్లా అధికారులు తెలిపారు. రష్యా విమానం పాకిస్తాన్ మీదుగా బంగ్లాదేశ్ చేరాల్సి ఉంది. ముందుగా ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదనే దానిపై పాకిస్తాన్ నుంచి క్లారిటీ రాలేదు. దీని తర్వాత ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ ‘‘టెక్నికల్, ప్రొసీజురల్ ఇష్యూస్’’ అని పేర్కొంది. దీనికి రాజకీయ కారణాలు ఆపాదించకుండా, సాంకేతిక సమస్యగా చూడాలని పాక్ చెప్పింది.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
పాకిస్తాన్ అనుమతి నిరాకరించడంతో రోసాటమ్ ఇంధన డెలివరీని రీషెడ్యూల్ చేసింది. విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఈ అణు విద్యుత్ కేంద్రం చాలా కీలకం. దేశం ప్రస్తుతం విద్యుత్ కొరత, గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ ప్లాంట్ నిర్మితమైతే బంగ్లాదేశ్ విద్యుత్ సమస్యలకు కొంత పరిష్కారం లభించవచ్చు.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!