Site icon NTV Telugu

Pakistan: పరువు కోసం పాక్ ఆర్మీ ప్రగల్భాలు.. భారత్‌పై దాడి చేయగలమంటూ బెదిరింపు..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ పై యుద్ధం చేయలేదన్న విషయం అందరికి తెలిసు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా అంగీకరించినట్లు పాకిస్తాన్ సుప్రసిద్ధ జర్నలిస్టు హమీద్ మీర్ చెప్పారు. పాకిస్తాన్ వద్ద ఆర్మీ వాహనాలు ఉన్నాయి కానీ అందులో పోసే ఇంధనం లేదని, శతఘ్నలు ఉన్నాయి కానీ అందులో ఉపయోగించేందుకు మందుగుండు సామాగ్రి లేదని బజ్వా అన్నట్లు హమీద్ మీర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ లో సంచలనంగా మారాయి. దీంతో పాక్ ఆర్మీ తమ పరువు కాపాడుకునేందుకు వివిధ రకాల స్టేట్మెంట్లు ఇస్తోంది.

తాజాగా శతృవు భూభాగంలోకి వెళ్లి యుద్ధం చేయగలమని పాకిస్తాన్ ఆర్మీ ప్రగల్భాలు పలికింది. పాక్ ఆర్మీకి చెందిన డిజి ఐఎస్‌పిఆర్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ పాక్ సైన్యంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ఆర్మీ సిద్ధంగా ఉందని.. యుద్ధం పరిస్థితి వస్తే భారత్ భూభాగంలో యుద్ధానికి దిగగలమని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళం దాన్ని చేసి చూపించిందని అన్నాడు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల అటాక్ లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయిన తర్వాత భారత్ పాకిస్తాన్ లోని బాలకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేసింది.

Read Also: Yogi Adityanath: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.. కాంగ్రెస్‌పై యోగి అటాక్..

ఇదిలా ఉంటే ఈ దాడిని గురించి ప్రస్తావిస్తూ.. పాక్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్ పిరికి దాడిని నిర్వహించిందని.. దానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టిందని గొప్పలకు పోయాడు. పాక్ ఎయిర్ ఫోర్స్ మాతృభూమి రక్షణ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, దురాక్రమణకు పాల్పడితే, శతృవు భూభాగంలో కూడా యుద్ధం చేస్తామని పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

భారత్ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం చేయలేదని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వా అంగకరించినట్లు, జర్నలిస్టులు హమీద్ మీర్, నసీమ్ జెహ్రా యూకేకు చెందిన పాకిస్తానీ మీడియా యూకే 44కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ పర్యటన గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బజ్వా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ విషయం అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా తెలియదని హమీద్ మీర్ వెల్లడించారు.

Exit mobile version