Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు.
అయితే, పాకిస్తాన్ మేజర్ సయ్యద్ ముయిజ్ అభినందన్‌ని పట్టుకోవడంతో అతను పాకిస్తాన్‌లో నేషనల్ హీరోగా మారాడు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని సరర్గోహా ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ దాడుల్లో సయ్యద్ మరణించినట్లు తెలుస్తోంది. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ యొక్క 6వ కమాండో బెటాలియన్‌కు పోస్ట్ చేయబడిన మేజర్ సయ్యద్ ముయిజ్ ఆ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మరణించినట్లు సమాచారం.
Read Also: Pakistan: అమెరికాకు ముప్పుగా పాకిస్తాన్.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
ఫిబ్రవరి 27న వైమానిక పోరాటంలో భాగంగా, అప్పటి వింగ్ కమాండర్ అయిన గ్రూప్ కెప్టెన్ వర్థమాన్, తరం పాత మిగ్ 21 విమానంలో పాక్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేసి జాతీయ హీరో అయ్యాడు. ఫైటర్ జెట్స్ ‘‘డాగ్ ఫైట్’’ సమయంలో అభినందన్ తన విమానమైన పాత సోవియట్ మిగ్ 21 విమానాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. విమానం దాడికి గురికావడంతో ఆయన పారాశ్యూట్ సాయంతో పీఓకేలో దిగాడు. ఆ సమయంలో పాక్ సైనికులు అభినందన్‌ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 6 గంటల పాటు ఆయన పాకిస్తాన్ చెరలో ఉన్నారు. ప్రపంచ దేశాలు ఒత్తిడి, భారత్ దాడి చేస్తుందనే భయంతో అప్పటి ఇమ్రాన్ ఖాన్ సర్కార్ అభినందన్‌ని గౌరవంగా భారత్‌కి అప్పగించింది. అభినందన్ నవంబర్ 2021లో అతను గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు, వీర్ చక్ర పురస్కారాన్ని అందుకున్నాడు.
