Sharif-Trump: ఎట్టకేలకు స్పందించిన పాక్.. ట్రంప్‌కి ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు
- ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్ని్కలపై స్పందించిన పాక్
- 3 రోజుల తర్వాత ట్రంప్‌కి ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్ని్కలపై ఎట్టకేలకు పాకిస్తాన్ స్పందించింది. నవంబర్ 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారీ విజయంతో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270 అయితే.. దాన్ని క్రాస్ చేసి 292 ఎలక్టోరల్ ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రంప్‌నకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ పాకిస్తాన్ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Jr NTR : తమిళ్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!!
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
‘‘రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు! పాకిస్తాన్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, విస్తృతం చేయడానికి రాబోయే పరిపాలనతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని షరీఫ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు నవంబర్ 6నే పోస్టు చేశారు అయితే పాకిస్తాన్లో సోషల్ మీడియాపై నిషేధం ఉండడంతో ఆలస్యంగా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఎక్స్ ట్విట్టర్‌పై నిషేధం ఉంటే ప్రధాని ఎలా ఉపయోగిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
ట్రంప్ జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, విస్కాన్సిన్ రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 226 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.
Congratulations to President-elect Donald Trump on his historic victory for a second term! I look forward to working closely with the incoming Administration to further strengthen and broaden the Pakistan-U.S. partnership. @realDonaldTrump
— Shehbaz Sharif (@CMShehbaz) November 6, 2024
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..