Pakistan: పాకిస్తాన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని, ఓ వ్యక్తి ఏకంగా అతని స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన కరాచీలోని హైప్రొఫైర్ ఏరియా డిఫెన్స్ ఫేజ్-5 ఏరియాలో ఫిబ్రవరి 8న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముగించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని సెషన్స్ జడ్జి కుమారుడు అలీ కిరియో(17)గా గుర్తించారు.
Read Also: Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
నిందితుడు దనియల్ తన స్నేహితురాలి కోసం ఆర్డర్ చేసిన బర్గర్ తినడంతో అలీ కిరియోల మధ్య వివాదం చెలరేగి, హత్యకు దారి తీసిందని పాక్ మీడియా బుధవారం వెల్లడించింది. నిందితుడు దనియల్ ఎస్పీ నజీర్ అహ్మద్ మిర్బహర్ కొడుకు. దనియల్ తన గర్ల్‌ఫ్రెండ్ షాజియాను తన నివాసానికి ఆహ్వానించాడని విచారణతో తేలింది. ఈ కార్యక్రమంలో దనియల్ ఇతర స్నేహితులు అలీ కీరియో, అతని సోదరుడు అహ్మెర్ కూడా పాల్గొన్నారు.
దనియల్ తన గర్ల్‌ఫ్రెండ్ షాజియా కోసం రెండు బర్గర్లను ఆర్డర్ చేశాడు. అయితే, వీటిని అలీ కీరియో తినడంతో వివాదం చెలరేగింది. దీంతో దనియల్ ఒక గార్డు రైఫిల్‌తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన కిరియో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమగ్ర విచారణ తర్వాత, ఈ ఘటనలో దనియల్‌ని బాధ్యుడిగా చేస్తూ నివేదికను సీనియర్ అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం దనియల్ నజీర్ కస్టడీలో ఉన్నాడు. దీనిపై న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది.