Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..
- వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం..
- నీటిని టబ్‌లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.
Read Also: Home Minister Anitha : టెక్నాలజీ చేయలేని పనులను స్నిఫర్ డాగ్స్ చేసాయి
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
రుతుపవనాల కారణంగా పంజాబ్ ప్రావిన్సులో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీని వల్ల 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామలు మునిగిపోయాయి. పాకిస్తాన్ దునియా న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..‘‘వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు వరద నీటిని ఇళ్లకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్‌లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి ఉండకుండా, పాకిస్తాన్ త్వరగా పూర్తి చేయగలిగే చిన్న ఆనకట్టల్ని నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.
జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్తానీయులు మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. చీనాబ్, రావి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ వరద నీరు ముల్తాన్ జిల్లానున చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతటా వ్యవసాయ భూములు మునిగిపోవడం, కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నాశనం కావడం వల్ల దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!