Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం మీడియా సమావేశంలో ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని ఆయన ప్రశ్నించారు. అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై సొంతదేశంలోనే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.
Read Also: Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!
Also Read
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ జరిగి ఒక ఏడాది గడిచిన సందర్భంగా భారత్ త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సాధించిన విజయాలను మరోసారి వివరించారు. 13 పాకిస్తాన్ విమానాలను, 11 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసినట్లు భారత సైనికాధికారులు వెల్లడించారు. అయితే, ఈ సమావేశంలో భారత అధికారులు ఇంగ్లీష్‌లో బ్రీఫింగ్ ఇవ్వడాన్ని చౌదరి ప్రశ్నించారు.
‘‘మీకు ఇంగ్లీష్‌లో మాట్లాడమని ఎవరు చెప్పారు..? ప్రపంచానికి మీ వెర్షన్ చెప్పేందుకే ఇలా మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్తానీ ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. పాక్ ఆర్మీలో అధికారిక ఆదేశాలు, అంతర్గత కమ్యూనికేషన్స్, పత్రాలన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయని పాక్ ప్రజలు గుర్తు చేశారు. మాజీ పాక్ ఆర్మీ అధికారి, జర్నలిస్ట్ ఆదిల్ ఫరూఖ్ రజా కూడా చౌదరి వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు. గాజు ఇంట్లో ఉండేవారు ఇతరులపై రాళ్లు వేయకూడదని హితవు పలికారు. పాకిస్తాన్ సైన్యంలో పై నుంచి కింది స్థాయి వరకు అన్ని ఆదేశాలు ఇంగ్లీష్‌లోనే అందుతాయని చెప్పారు.
DJ ISPR crying about English 😂🤣
"Paijan why you exposed us internationally paijaan" pic.twitter.com/ITJJuqXrhb— War & Gore (@Goreunit) May 7, 2026
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!