Site icon NTV Telugu

UK: ఎయిర్‌పోర్టులో యురేనియం కలకలం.. పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానం

Uk

Uk

Package Containing Uranium Seized At London Airport: ఉగ్రవాదులు మళ్లీ యూరప్ దేశాల్లో దాడులకు పాల్పడబోతున్నారా..? అంటే తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడింది. యురేనియంతో కూడిని ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి వచ్చే విమానంలో ఈ ప్యాకేజీ లభించింది.

Read Also: VandeBharat: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. టైమింగ్స్ ఇవే.. స్పీడ్ ఇంత తక్కువా?

స్క్రాప్ మెటల్ షిప్‌మెంట్‌లో యురేనియం దొరికింది. అణుపదార్థంగా యురేనియాన్ని వాడుతారు. అణ్వాస్త్రాలు, అణు విద్యుత్ ఫ్లాంట్లలో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. పాకిస్తాన్ నిఘా లేకపోవడం వల్లే ఇది వచ్చిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టుబడిన యురేనియం చిన్న మొత్తంలోనే ఉందని.. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణులు అంచనా వేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు యూకే పోలీసులు తెలిపారు.

Exit mobile version