Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్‌లో అబోట్టాబాద్‌లో బిన్ లాడెన్‌ని చంపేశారు. తాజాగా జియో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Read Also: Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే
‘‘కండోలిజా రైస్( మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్) పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న సమయంలో, ఆమె తనకు బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు భయపడింది’’ అని గిలానీ చెప్పాడు. 2008 నుండి 2012 వరకు గిలానీ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేయగా, రైస్ అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉంది, ఆ సమయంలో ఆమె నాలుగుసార్లు పాకిస్తాన్‌లో పర్యటించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత రైస్ ఇస్లామాబాద్‌లో ఆకస్మికంగా పర్యటించిన సమయంలో ఆమె తనను కలిసినట్లు గిలానీ చెప్పారు. లాడెన్ పాక్‌లో ఉన్నట్లు తనకు చెప్పితే, అది తప్పుడు సమాచారంగా కొట్టిపారేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, పాకిస్తాన్ అబోటాబాద్‌లో మే 2, 2011లో అమెరికా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించి బిన్ లాడెన్‌ని హతమార్చింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే కోడ్-పేరుతో ఈ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నారు. నేవీ సీల్స్, అమెరికా సీఐఏ ఈ ఆపరేషన్‌ని పకడ్బందీగా నిర్వహించింది. కనీసం పాక్ ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు. ఆప్ఘనిస్తాన్ లోని అమెరికా నుంచి బ్లాక్ హాక్ హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పాక్ రాడార్లకు చిక్కకుండా ఒసాబా బిన్ లాడెన్ ఉన్న బిల్డింగ్ వద్ద ల్యాండ్ అయి, కొన్ని నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించాయి.