Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు
- 2011లో నరహంతకుడు బిన్ లాడెన్ హతం
- విదేశాల్లో ఉన్న లాడెన్ కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2001 సెప్టెంబర్ 11, అమెరికన్ల జీవితాల్లో ఒక పీడకల. అంతేకాదు ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిన దుర్ఘటన. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా తీవ్ర షాక్‌కు గురైన సంఘటన. ఎవరు మరిచిపోయినా.. అమెరికన్లు మాత్రం ఈ సంఘటనను ఈనాటికి మరిచిపోలేకపోతున్నారు. ఇక వేలాది మందిని పొట్టన బెట్టుకున్న నరహంతకుడు ఒసామా బిన్ లాడెన్ కూడా చనిపోయి 15 ఏళ్లు గడిచిపోయింది. అయినా ఈనాటికి అమెరికన్లు ఆ దుర్మార్గుడిని గుర్తుచేసుకుంటూనే ఉంటున్నారు. అంత భయంకరమైన సంఘటన 9/11. రేపటితో 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆరోజు ఏం జరిగింది. ఈ మారణహోమానికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉంది. ఇవన్నీ తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఒసామా బిన్ లాడెన్ అల్-ఖైదా నాయకుడు. ఈ నరహంతకుడికి ఐదుగురు భార్యలు, 24 మంది సంతానం. 2000 సంవత్సరంలో దక్షిణ యెమెన్‌కు చెందిన 18 ఏళ్ల బాలికను మొదట పాకిస్థాన్‌కు.. అనంతరం ఆప్ఘన్స్థాన్లోని కందహార్‌కు తీసుకెళ్లాడు. ఆమెకు అల్-సదా అని పేరు పెట్టాడు. అటు తర్వాత ఆమెను ఐదు వివాహం చేసుకున్నాడు. కాందహార్‌లో పెద్ద ఎత్తున సంబరాలతో పాటు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. సున్నీ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహానికి పురుషులు మాత్రమే హాజరయ్యారు. స్త్రీలు హాజరు కాలేదు. చాలా ఘనంగా ఈ వేడుకగా జరిగింది.
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్

ఈ వివాహం జరిగిన మరుసటి సంవత్సరమే 2001, సెప్టెంబర్ 11న అమెరికాపై కుట్రను అమలు చేశాడు. అల్-ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేశారు. న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పైకి రెండు విమానాలు ఢీకొట్టాయి. దీంతో ఆ రెండు భవనాలు ధ్వంసమయ్యాయి. మూడో విమానం పెంటగాన్‌ను ఢీకొట్టింది. ట్విన్ టవర్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర దాడిలో దాదాపు 3 వేల మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.
ఈ దాడి జరిగిన కొద్ది రోజులకే ఐదో భార్య అయిన అమల్ అల్-సదా.. సఫియా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. కొన్ని వారాల తర్వాత పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో లాడెన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 11 తర్వాత ఒక కుమార్తెకు తండ్రిని అయినట్లు తెలిపాడు. ప్రవక్త కాలంలో ఒక యూదు గాఢచారిని హతమార్చిన సఫియా పేరునే ఆమెకు పెట్టినట్లు వెల్లడించాడు. నా కుమార్తె కూడా సఫియా వలే ఇస్లాం శత్రువులను హతమారుస్తుందని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత అమెరికా ఒక క్లారిటీ వచ్చింది.
9/11 ఘటనకు పూర్తి కుట్ర దారుడు లాడెన్‌గా అమెరికా కనిపెట్టింది. అంతే అప్పటి నుంచి అతడి కోసం వేటాడుతూనే ఉంది. మొత్తానికి పదేళ్ల తర్వాత 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఇంట్లో భార్య, పిల్లలతో ఉన్నప్పుడు అమెరికా సైన్యం చాలా చాకచక్యంగా ముట్టడించి హతమార్చింది. ఈ దాడిలో లాడెన్‌తో సహా కొందరు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత క్రూర నరహంతకుడు, తండ్రి మరణాన్ని సఫియా ప్రత్యక్షంగా చూసింది. ఈ ఘటనలో ఐదో భార్య అమల్ కూడా గాయపడింది. ఈ దాడిలో ఒక కుమారుడు కూడా చనిపోయాడు.
తీవ్రవాద విశ్లేషకుడు పీటర్ బెర్గెన్ తన ‘‘ది ఒసామా బిన్ లాడెన్ ఐ నో: యాన్ ఓరల్ హిస్టరీ ఆఫ్ ది అల్-ఖైదా లీడర్ ’’ అనే పుస్తకంలో బిన్ లాడెన్ వివాహాల గురించి రాసుకొచ్చాడు. ‘‘మొదటి వివాహం 17 ఏళ్ల వయసులో అతని కంటే బహుశా రెండు సంవత్సరాలు చిన్నదైన అతని కజిన్ నజ్వా ఘనేమ్తో జరిగింది. వీరికి 11 మంది పిల్లలు. కానీ 9/11కి కొన్ని రోజుల ముందు నజ్వా అతన్ని విడిచిపెట్టింది.’’ అని పేర్కొన్నారు.
బిన్ లాడెన్ రెండవ భార్య ఖదీజా షరీఫ్. అతని కంటే తొమ్మిదేళ్లు పెద్దది. ఉన్నత విద్యావంతురాలు. ప్రవక్త ప్రత్యక్ష వారసురాలు. 1983లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చివరకు 1990లలో సూడాన్‌లో నివసిస్తున్నప్పుడు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఖదీజా సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లిందని చెబుతారు.
బిన్ లాడెన్ మొదటి భార్య నజ్వా. ఖైరియా సాబెర్‌తో మూడవ వివాహానికి మార్గం సుగమం చేసింది. ఆమె కూడా ఇస్లామిక్ షరియాలో డాక్టరేట్ పొందిన అత్యంత విద్యావంతురాలు. ఆమె 1985లో బిన్ లాడెన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 2001 అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన బాంబు దాడుల నుంచి ఆమె ప్రాణాలతో బయటపడిందో లేదో తెలియదని బెర్గెన్ రాశారు.
ఆ తర్వాత 1987లో బిన్ లాడెన్‌ను సిహమ్ సబార్ వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఖైరియా లాగే ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి జరిగినప్పటి నుంచి ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు. బిన్ లాడెన్ ఐదవ వివాహం అమల్ అల్-సదాతో జరిగింది. వీరికి సఫియా అనే కుమార్తె ఉంది . బిన్ లాడెన్‌కు ఆమెతో కూడా ఐదుగురు పిల్లలు ఉన్నారు.
బిన్ లాడెన్ పిల్లలకు ఏమైంది?
బిన్ లాడెన్ పిల్లల్లో చాలా మంది గురించి బహిరంగ సమాచారం లేదు. బిన్ లాడెన్ తన కుమారులను తన అడుగుజాడల్లో నడవడానికి శిక్షణ ఇచ్చాడు. అమెరికా ఆపరేషన్‌లో బిన్ లాడెన్ 23 ఏళ్ల కుమారుడు ఖలీద్ కూడా మరణించాడు. సీల్ కాల్పుల్లో అమల్ అల్-సదా గాయపడగా.. బిన్ లాడెన్ కుమార్తె సఫియా తన తండ్రి మరణాన్ని కళ్లారా చూసింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఆ ముగ్గురు భార్యలను, పిల్లలను నిర్బంధించి సౌదీ అరేబియాకు అప్పగించింది. 2009లో అతని మరో కుమారుడు సాద్ బిన్ లాడెన్ కూడా అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు.
బిన్ లాడెన్ పెద్ద కుమారుడు అబ్దుల్లా ఒసామా బిన్ లాడెన్. అతను అతని మొదటి భార్య నజ్వా ఘనేమ్ కుమారుడు. నివేదికల ప్రకారం.. అబ్దుల్లాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు బిన్ లాడెన్ అతన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు తీసుకువచ్చాడు. బిన్ లాడెన్ విధించిన కఠినమైన ఆంక్షల వల్ల అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అబ్దుల్లా తన కజిన్‌ను వివాహం చేసుకుని 1995లో జెడ్డాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతనికి తన తండ్రితో ఎలాంటి సంబంధం లేదు.
బిన్ లాడెన్ పిల్లలలో అత్యంత ప్రసిద్ధమైన పేరు హమ్జా బిన్ లాడెన్. హమ్జా అతని మూడవ భార్య ఖైరియా సబార్ కుమారుడు. బిన్ లాడెన్ హమ్జాను తన వారసుడిగా తీర్చిదిద్దాడు. బిన్ లాడెన్ మరణం తర్వాత హమ్జా అల్-ఖైదా కార్యకలాపాలను చేపట్టాడు. 2017లో అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమ్జా హతమయ్యాడని ప్రకటించారు. అయినప్పటికీ హమ్జా బతికే ఉన్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇక మొదటి భార్యకు పుట్టిన నాల్గవ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ కూడా వార్తల్లో ఉన్నాడు. తాను 14 ఏళ్ల వయస్సు నుంచే అల్-ఖైదా శిబిరాల్లో శిక్షణ పొందానని ఒమర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అమాయక ప్రజల హత్యలలో తాను పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదని.. అందుకే 2000 సంవత్సరంలో అల్-ఖైదాను విడిచిపెట్టానని అతను పేర్కొన్నాడు. 2010లో ఒక ఇంటర్వ్యూలో తాను చిన్నప్పుడు గట్టిగా నవ్వినందుకు తన తండ్రి బిన్ లాడెన్ తనను తీవ్రంగా కొట్టాడని అతను చెప్పాడు.

ఒమర్ బిన్ లాడెన్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. 2006 సెప్టెంబర్‌లో బ్రిటిష్ మహిళ జేన్ ఫెలిక్స్-బ్రౌన్‌ను వివాహం చేసుకున్నాడు. మొదట జెడ్డాలో నివసించారు. తర్వాత ఫ్రాన్స్‌కు తరలివెళ్లారు. 2016 నుంచి భార్యతో కలిసి ఫ్రాన్స్‌లో నివసిస్తూ ఒక కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ అతన్ని దేశం విడిచి వెళ్లకుండా నిషేధించింది. 2023లో ఫ్రాన్స్ విడిచి వెళ్ళిన తర్వాత ఆ నిషేధాన్ని శాశ్వతం చేశారు. 2024 నాటి బీబీసీ నివేదిక ప్రకారం.. ఫ్రాన్స్ విడిచి వెళ్లిన తర్వాత ఒమర్ ఖతార్‌కు తరలివెళ్లాడు.
బిన్ లాడెన్‌కు 11 మంది కుమారులు ఉన్నారు. కానీ వారిలో చాలామంది అతనికి మద్దతు ఇవ్వలేదు. హమ్జా బిన్ లాడెన్ ప్రపంచ ఉగ్రవాదిగా మారి .. బహుశా 2019లో హతమయ్యాడు. బిన్ లాడెన్ కుమార్తెల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. బిన్ లాడెన్ కుమార్తెల గురించి అతని అంగరక్షకుడు అబు జుందాల్‌కు కూడా చెప్పలేదు. 2005లో ఖుద్స్ అల్-అరబీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిన్ లాడెన్‌కు ఎంతమంది కుమార్తెలు ఉన్నారో తనకు తెలియదని అబు జుందాల్ పేర్కొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో బిన్ లాడెన్‌కు మొత్తం 11 మంది కుమారులు ఉన్నారని.. వారిలో కొందరు తమ తండ్రిని విడిచిపెట్టారని చెప్పాడు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?