NTV Telugu Site icon

US: ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత

Organiccarrots

Organiccarrots

ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను రీకాల్ చేసినట్లు సీడీసీ తెలిపింది. ఈ క్యారెట్లతో అంటువ్యాధులు వ్యాప్తిచెందినట్లుగా దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్‌లోని ఈ నగరాల్లో లాక్డౌన్

అమెరికాలోని ప్రధాన ఆహార రిటైల్ షాపుల్లో ఈ క్యారెట్లు విక్రయిస్తుంటారు. ఈ కూరగాయలను 18 రాష్ట్రాల్లో వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తుంటారు. కాలిఫోర్నియాలోని గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించే మొత్తం బ్యాగ్డ్ క్యారెట్లు, బేబీ క్యారెట్‌లతో అంటువ్యాధులు వ్యాప్తిచెందినట్లు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆదివారం తెలిపింది. క్యారెట్‌లను తినడం వల్ల ఒక వ్యక్తి మరణించాడని.. దాదాపు 50 మంది అస్వస్థతకు గురైనట్లు పేర్కొంది. ఇందులో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే క్యారెట్లు కొనగోలు చేసి ఇళ్లల్లో భద్రపరుచుకున్న ప్రతివారు వాటిని పడేయాలని సీడీసీ హెచ్చరించింది. ఇప్పటికే వాటి రవాణాను కూడా నిలిపివేసింది. సరఫరా చేయబడిన వాటిని రీకాల్ చేయాలంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. రీకాల్ చేయబడిన క్యారెట్‌లలో ఆగస్టు 14 నుంచి అక్టోబర్ 23 వరకు ఉన్న తేదీలు ఉన్నాయి. రీకాల్ చేయబడిన బేబీ క్యారెట్‌లు సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 12 వరకు ఉన్న తేదీలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై పరిశోధన జరుగుతోందని, ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు గ్రిమ్‌వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Crime: 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

Show comments