NTV Telugu Site icon

Mount Guatape – Katie Black: పవిత్ర ప్రదేశంలో బూతు పని.. దుమ్మెత్తిపోసిన ప్రజలు

Katie Black Mount Guatape

Katie Black Mount Guatape

OnlyFans Star Faces Police Fine After Filming X-rated Video On Holy Mountain: ‘ఈజీ మనీ’ కోసం కొందరు అమ్మాయిలు ‘బూతు’ మార్గాన్ని ఎంపిక చేసుకుంటుంటారు. తమ నగ్న ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో పోస్టు చేసి.. సొమ్ము చేసుకుంటుంటారు. ఇలాంటి వారి కోసం ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే అడల్ట్ వెబ్‌సైట్ ఉంటుంది. కేటీ బ్లాక్ అనే అడల్ట్ స్టార్ కూడా.. ఈ వెబ్‌సైట్‌లో బూతు వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న అడల్ట్ కంటెంట్‌ని కూడా పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఒక వీడియో.. తీవ్ర దుమారం రేపింది. ఏకంగా కొలంబియా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశ ప్రజలందరూ ఆ యువతిని దుమ్మెత్తిపోస్తున్నారు. అంతలా ఈ అమ్మడు ఏం చేసిందనేగా మీ సందేహం?

Boat Stuck In Sea: సముద్రం మధ్యలో చిక్కుకున్న షిప్.. ప్రమాదంలో 400 మంది

కొలంబియాలో మౌంట్ గ్వటాపేగా అనే ఒక పర్వతం ఉంటుంది. స్థానికులందరూ ఈ పర్వతాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తుంటారు. ఇక్కడికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అక్కడికి వచ్చే ప్రతిఒక్కరూ సంప్రదాయబద్దంగా ప్రవర్తిస్తారు. ఆ పర్వతానికి ఈ కేటీ బ్లాక్ అనే యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లింది. 800 మెట్లు ఎక్కి ఆ పర్వతం పైకి కూడా ఎక్కారు. అయితే.. కిందకు దిగే క్రమంలో, వీరికి ఒక ప్రదేశం కనిపించింది. ఎవ్వరూ లేకపోవడంతో, అక్కడే రాసలీలలు కొనసాగించారు. అంతటితో ఆగకుండా.. తమ రాసలీలల పర్వాన్ని ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత దాన్ని తన అడల్ట్ వెబ్‌సైట్‌లో పెట్టింది. అభిమానుల కంటపడిన ఈ వీడియో.. మెల్లగా వైరల్ అయ్యింది. ఇక దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ వీడియో గురించి తెలియడంతో.. కేటీ బ్లాక్‌ని టార్గెట్ చేసుకొని, విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. పవిత్ర ప్రదేశంలో తప్పు చేయడమే కాకుండా.. ఆ వీడియోని అడల్ట్ వెబ్‌సైట్‌లో పెడతావా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం

ప్రజల నుంచి వచ్చిన ఈ ఆగ్రహం చూసి.. పోలీసులు రంగంలోకి దిగారు. దేశ ప్రజలు పవిత్రంగా భావించే గ్వటాపేగా ప్రదేశంలో ఆ జంట చేసిన పని తగదని, దీనిపై కచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయవాదులు కూడా స్పందించారు. పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన వారు అక్కడి సంప్రదాయాలను, విశ్వాసాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇలాంటి వారికి తగిన శిక్షలు విధిస్తే.. భవిష్యత్తులో తప్పు పని చేయాలన్న ఆలోచన కూడా మరెవ్వరికీ రాదని పేర్కొంటున్నారు.