Omicron BA.4.6 Variant Is Now Spreading: కోవిడ్ 19 వ్యాధి పుట్టి దాదాపుగా మూడు ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఇది ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కరోనా తన రూపాలను మారుస్తూ.. మనుషులపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్, డెల్టా, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తాజాగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4.6 వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్ లో బీఏ.4.6 వేరియంట్ కేసులు వెలుగులోకి రాగా.. ప్రస్తుతం యూకేలో కూడా ఈ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాల ప్రకారం ఆగస్ట్ 14 తర్వాతి వారంలో బీఏ.4.6 కేసులు యూకేలో 3.3 శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది 9 శాతానికి పెరిగింది. ఇక యూకేలో కూడా బీఏ.4.6 కేసులు పెరుగుతున్నాయి.
Read Also: Asaduddin Owaisi: ఆ విషయంలో ప్రధాని మోదీని చిరుతతో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ
బీఏ.4.6 వేరియంట్ అనేది బీఏ.4 రూపాంతర సంతతి. బీఏ.4ని మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో కనుక్కున్నారు. బీఏ.4.6 ఎలా పుట్టిందనేదానిపై ఇప్పటికీ పూర్తిగా స్పష్టత రాలేదు. ఇది రికాబినెంట్ వేరియంట్ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు వేరేవేరు వేరియంట్లు ఒకే సారి ఒకే వ్యక్తికి సోకినప్పుడు ఈ వేరియంట్ పుట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
బీఏ.4.6 అనేక విధాలుగా బీఏ. 4గా ఉంటుంది. వైరస్ పైన ఉండే స్పైక్ ప్రోటీన్ కూడా బీఏ4లాగే ఉంటుంది. ఈ స్పైక్ ప్రోటీన్ మన కణాలను హైజాక్ చేయడానికి ఉపయోగపడుతాయి. మన రోగనిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు సహాయపడుతుంది. అయితే వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. దీని వల్ల ప్రమాదతీవ్రత తక్కువగానే ఉంది. అయితే ఈ రకం వేరియంట్ ను అడ్డుకునేందుకు కోవిడ్ 19 వ్యాక్సినేషనే ఉత్తమ మార్గమని వైద్యులు చెబుతున్నారు.
