Site icon NTV Telugu

Donald Trump: అమెరికాలో కెనడా విలీనం.. కొత్త మ్యాప్‌ని షేర్ చేసిన ట్రంప్..

Donald Trump

Donald Trump

Donald Trump: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. అయితే, ఈ కెనడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. కెనడా, అమెరికాలో విలీనమైనట్లు సూచించే ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌ షేర్ చేశారు. కెనడా, అమెరికాలో భాగమైనట్లు సూచిస్తూ ‘‘ఓ కెనడా’’ అంటూ కామెంట్స్ చేశారు.

Read Also: Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ కోల్పోనుందా?

అంతకుముందు, అమెరికాలో కెనడా 51 వ రాష్ట్రంగా మారాలని సూచించాడు. తమ ఆర్థిక శక్తిని ఉపయోగించి కెనడాని బెదిరించాడు. రెండు దేశాల మధ్య కృత్రిమంగా గీసిన గీతను వదిలించుకోండని తన ఎన్నిలక విజయాన్ని ధ్రువీకరించిన తర్వాత విలేకరులతో ట్రంప్ వ్యాఖ్యానించారు. కెనడాలోని మెజారిటీ ప్రజలకు అమెరికాలో రాష్ట్రం కావడం ఇష్టమే అని ఆయన అన్నారు. ఆ దేశ భారీ వాణిజ్యలోటును, రాయితీలను అమెరికా ఎంతో కాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకి తెలుసు కాబట్టే రాజీనామా చేశారని చెప్పారు. అమెరికాలో విలీనమైతే సుంకాలు, అధిక పన్నులు ఉండవు, చైనా, రష్యాల నుంచి ముప్పు ఉండదని చెప్పారు.

అంతకుముందు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత, ట్రూడో ట్రంప్‌ని కలిశాడు. ఆ సమయంలో కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా వస్తు్న్న వారిని కట్టడి చేయాలని ట్రూడోకి హెచ్చరించారు. అంతే కాకుండా, కెనడాను అమెరికాలో కలిపేయాలని, అమెరికాలో రాష్ట్రంగా మారిన తర్వాత కెనడా రాష్ట్రానికి గవర్నర్‌గా ట్రూడో ఉండాలని చెప్పాడు.

Exit mobile version