Site icon NTV Telugu

Kim Jong Un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్

Kim Jong Un

Kim Jong Un

North Korea’s Kim Jong Un battling mid-life crisis, cries and drinks all day: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజంతా విపరీతంగా తాడుతూ ఏడుస్తున్నాడని తెలిసింది. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కు 39 ఏళ్లు నిండాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి.

Read Also: GO First Airlines: బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే విమాన ప్రయాణం

సియోల్‌కు చెందిన ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చోయ్ జిన్‌వూక్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు నిండిన కిమ్ జోంగ్ ఉన్ తన వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతపై ఆందోళన చెందుతున్నాడని.. తాగి ఏడుస్తున్నట్లు నేను విన్నానని.. అతడు చాలా ఒత్తడిని, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడని అన్నారు. వైద్యులతో పాటు భార్య తరుచుగా వ్యాయామం చేయమని చెబుతున్నారని.. అయితే వాటిని కిమ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచే కిమ్ జోంగ్ ఉన్, గతేడాది తన కుమార్తెతో కలిసి క్షిపణి ప్రయోగ కేంద్రంలో పరిశీలించారు. తొలిసారిగా తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయడం చర్చనీయాంశం అయింది. కిమ్ తరువాత వారసత్వాన్ని ఆయన కుమార్తె తీసుకుంటుందని చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. మరోవైపు కిమ్ ఆరోగ్యంపై వదంతులు కూడా అలాగే వస్తున్నాయి. గతంలో కిమ్ కోమాలోకి వెళ్లాడని, కిమ్ తలకు శస్త్రచికిత్స అయిందని వార్తలు వినిపించాయి. అయితే చాలా కాలం తరువాత కిమ్ సన్నబడి మళ్లీ కనిపించాడు.

Exit mobile version