NTV Telugu Site icon

North Korea: ఇది ఉత్తర కొరియా “వోల్వో కార్”ల కహానీ.. 50 ఏళ్లుగా స్వీడన్‌కి పైసా చెల్లించలేదు..

Kim Jong Un

Kim Jong Un

North Korea: ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు.

ఇదిలా ఉత్తర కొరియాకు చెందిన ఓ కార్ల కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 49 ఏళ్ల క్రితం 1974 ఉత్తర కొరియా 1000 వోల్వో కార్లను ఆర్డర్ పెట్టి, స్వీడన్ నుంచి తమ దేశానికి తెప్పించింది. అప్పట్లో వీటి విలువ 73 మిలియన్ డాలర్లు. అయితే ఇప్పటి వరకు ఆ డబ్బును ఉత్తర కొరియా, స్వీడిష్ కంపెనీ వోల్వోకు చెల్లించలేదు. దాదాపుగా 5 దశాబ్ధాల నుంచి ఈ డబ్బులను చెల్లించలేదు. ఇప్పుడు వాటి విలువ 330 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

Read Also: Israel-Hamas War: శ్మశానాలు నిండిపోయాయి.. ఫుట్‌బాల్ మైదానంలో మృతుల ఖననం..

ఉత్తర కొరియా పాశ్చాత్య దేశాల నుంచి విదేశీ మూలధంన, సాంకేతికత కోసం పరికరాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఉత్పత్తి, మైనింగ్ ఉత్పత్తులతో రుణదాతలకు రుణాలు చెల్లిస్తామని వాగ్దానం చేసింది. అయితే నార్త్ కొరియా పాలకులు ఈ అప్పులను చెల్లించే ఉద్దేశం లేదని రుణదాతలకు తర్వాత అర్థమైంది. 2016లో స్వీడిష్ ఎంబసీ ఒక పోస్టులో దీని గురించి పేర్కరొంది. డీపీఆర్ కొరియా 1974 స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లలో ఒక్కదానికి కూడా డబ్బులు చెల్లించలేదని ట్వీట్ చేసింది.

విషయం ఏంటంటే డబ్బులు చెల్లించకున్నా.. ఆ కార్లను ఉత్తర కొరియా ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉంది. ప్రత్యేక అవసరాల కోసం వీటని వినియోగిస్తోంది. ఎన్‌పీఆర్ రిపోర్ట్ ప్రకారం.. యూఎస్ జర్నలిస్ట్ అర్బన్ లెహ్నర్ 1989లో ఉత్తర కొరియాలో తన రెండు వారాల పర్యటన కోసం వోల్వో 144 సెడాన్ కార్‌లో ప్రయాణించారు. జర్నలిస్టులు ఈ కార్లలో ప్రయాణించే వారని, రోడ్లు చాలా ఖాళీగా ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు.