Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒక వేళ హత్యకు గురైతే ప్రళయం సృష్టిస్తామని ఆ దేశం చెబుతోంది. ఒక నివేదిక ప్రకారం.. విదేశీ దాడిలో తమ నాయకుడు కిమ్ హత్యకు గురైనా, అశక్తుడైనా ఆటోమెటిక్‌గా అణుదాడి చేయాలని ఉత్తరకొరియా ఒక కొత్త అణు విధానాన్ని తీసుకుంది. మార్చి 22న రాజధాని ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఉత్తరకొరియా 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యంగ సవరణను ఆమోదించినట్లు ‘‘ ది టెలిగ్రాఫ్’’ నివేదించింది.
కొత్తగా సవరించిన చట్టం ప్రకారం, దేశ అణ్వాయుధాలపై కిమ్ జోంగ్ ఉన్న ఆధిపత్యం కొనసాగుతుంది, కానీ ఆయనను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం ఎలా ఉంటుందనేది కొత్త నిబంధనలు నిర్వచిస్తున్నాయి. ‘‘శత్రు దేశాల దాడుల వల్ల దేశ అణ్వాయుధాలపై ఉణ్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు ప్రమాదం వాటిల్లితే, ఆటోమెటిక్‌గా, తక్షణమే అణు దాడి జరుగుతుంది’’ అని ఉత్తర కొరియా తన అణు విధాన చట్టంలో ఆర్టికల్ 3లో పేర్కొన్నట్లు నివేదిక చెబుతోంది.
Also Read
ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ, పలువురు సీనియర్ నాయకులు ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో చనిపోయిన నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజకీయాలను అధ్యయనం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు ప్రకారం.. ఉత్తర కొరియాలో గతంలో కూడా ఈ నిబంధనలు ఉండీ ఉండొచ్చని, కానీ ఇప్పుడు రాజ్యాంగంలో చేర్చడం ద్వారా దీనికి మరింత ప్రాముఖ్యత కల్పించినట్లైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నిగూఢ దేశంగా ఉన్న ఉత్తర కొరియాలో గూఢచార ఆపరేషన్స్ సాధ్యం కావని చెబుతున్నారు. ఉత్తరకొరియాలోని విదేశీ ప్రముఖులు, రాయబారులపై కూడా నిఘా ఉంటుందని చెబుతున్నారు. అయినప్పటికీ, ఇరాన్ పరిణామం ఉత్తరకొరియాకు ఒక డేంజర్ సిగ్నల్ పంపిందని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?