Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki Part 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పటికే ‘కల్కి 2’ షూటింగ్ స్టార్టింగ్ కాగా, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం.. కల్కి పార్ట్ 2ని వచ్చే ఏడాది చివరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ముగింపులో కమల్ హాసన్ పాత్ర, ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్ పార్ట్ 2పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. సాధారణంగా ఇలాంటి భారీ గ్రాఫిక్స్ సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ‘కల్కి 2’ విషయంలో నాగ్ అశ్విన్ ఒక మాస్టర్ ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం. నిజానికి పార్ట్ 1 షూటింగ్ టైంలోనే పార్ట్ 2కి సంబంధించిన చాలా వరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు, కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసి ఉంచారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కేవలం నటీనటుల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ స్టార్ కాస్ట్ తమ డేట్స్ కేటాయించి, షూటింగ్ త్వరగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది ఎండింగ్‌కు పక్కాగా సినిమా రావడం పెద్ద కష్టమేమీ కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!