North Korea Missile Launch: మూడురోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవడం లేదు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరికలు చేసింది. దీనికి అనుగుణంగానే ఉత్తర కొరియా తన వైఖరిని చాటుకుంటోంది.
ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పక్కనపెట్టి క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తరకొరియా తాజాగా నిన్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్‌బీఎం)ని పరీక్షించింది. ఇది ఓ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. తన ప్రధాన నౌకాదళ స్థావరమైన సిన్‌పో సమీపంలో దీనిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. గత మూడు రోజుల్లో ఇది రెండో క్షిపణి ప్రయోగం. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ప్రయోగం చేపట్టడం చర్చకు దారితీసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా నిర్ధారించింది. సిన్‌పోలో జలాంతర్గాములు ఉన్నట్టు నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలు విడుదల అయ్యాయి. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగినట్టు తెలిపింది.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇదిలా వుంటే… అణు పరీక్షలకు కిమ్ సిద్ధమవుతున్నట్టు అమెరికా ఆందోళన చెందుతోంది. అణు పరీక్ష కోసం నార్త్ కొరియా ‘పుంగే-రి’ టెస్ట్ సైట్‌ను సిద్ధం చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ఈ నెలాఖరులో జపాన్, దక్షిణ కొరియాలలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరేమనుకున్నా ఉత్తర కొరియా మాత్రం తగ్గేదేలే అంటోంది.
Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!