Site icon NTV Telugu

North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. ఆ రెండు దేశాలే కాపాడుతున్నాయన్న యూఎస్ఏ

North Korea

North Korea

North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది.

గడిచిన రెండు వారాల్లో మొత్తం 6 క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించింది. తాజాగా గురువారం తెల్లవారుజామున స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రం వైపు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. దీంతో దక్షిణ కొరియా మరింత అలర్ట్ అయింది. జపాన్ కూడా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలను ధ్రువీకరించింది. మొదటి క్షిపణి 100 కిలోమీటర్ల ఎత్తులో 350 కిలోమీటర్లు ప్రయాణించిందని.. రెండో క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్లు ప్రయాణించిందని జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకాజు హమదా తెలిపారు.

Read Also: Jio True 5G: 5జీలోనూ జియో సంచలనం.. అన్నీ ఫ్రీ… వారికి మాత్రమే..

ఈ క్షిపణి ప్రయోగాలపై అమెరికాను నిందించింది చైనా. దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టడంతోనే ఈ క్షిపణి ప్రయోగాలు జరుగుతున్నాయని యూఎన్ లో డిప్యూటీ చైనా రాయబారి గెంగ్ షువాంగ్ అన్నారు. యూఎస్ఏ ప్రాంతీయ భద్రతా వాతావరణాన్ని కలుషితం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రష్యా, చైనాల ఉత్తర కొరియాకు మద్దతు ఇస్తున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా నిందించింది.

యూఎన్ భద్రతా మండలిలో బుధవారం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై చర్చ జరిగింది. 15 దేశాల ఉండే భద్రతా మండలి బుధవారం సమావేశమైంది. నార్త్ కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని యూఎస్ఏ కోరింది. అయితే యూఎస్ఏ ప్రతిపానను రష్యా, చైనాలు తోసిపుచ్చాయి. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలపై తొలిసారిగా రష్యా, చైనాలు తమ వీటో అధికారాన్ని ఉపయోగించాయి. సౌత్ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పర్యటన నేపథ్యంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను చేపడుతోంది.

Exit mobile version