ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఆహార ఉత్పత్తులను పెంచుకోవడం వంటివాటిపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం గురించి, జపాన్, దక్షిణ కొరియా గురించి ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read: ఆ హోటల్‌లో మాటలుండవ్.. ఓన్లీ సైగలే…
అయితే, ఈస్ట్ కోస్ట్ నుంచి ఏరియా నుంచి బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు రాయిటర్స్ పేర్కొన్నది. మిస్సైల్స్ గురించి సమావేశాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్టు తెలుస్తోంది. కిమ్ మారిపోయాడు అనుకునేలాగా ఇలా మరోసారి మిస్సైల్‌ను పరీక్షించి తగ్గేదిలేదంటున్నాడు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో పాటుగా దేశాభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల మౌలికవసతులను ఏర్పాటు చేసుకుంటామాని కిమ్ చెప్పడం విశేషం.
