ఆ హోటల్‌లో మాట‌లుండ‌వ్‌.. ఓన్లీ సైగ‌లే…

ఈమ‌ధ్య‌కాలంలో యువ‌త వినూత్నంగా ఆలోచిస్తూ విజ‌యాలు సాధిస్తున్న‌ది.  కొత్త కొత్త విష‌యాల‌ను నేర్చుకొని వాటిని అమ‌లు చేస్తూ స‌క్సెస్ బాట ప‌డుతున్న‌ది.  దీనికి ఓ ఉదాహ‌ర‌ణ పూణేలోని ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న టెర్రాసైన్ హోట‌ల్‌.  ఈ హోట‌ల్‌కు వెళ్తె అక్క‌డ ఎవ‌రూ మాట్లాడ‌రు.  అక్క‌డికి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌ను ఏం కావాలి, ఏం తింటారు అనే విష‌యాల‌ను సైగ‌ల‌ద్వారా అడుగుతారు.  వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు సైగ‌ల‌తో చెప్ప‌వ‌చ్చు లేదా కావాల్సిన‌వి మెనూలో చూపించ‌వ‌చ్చు.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  ఇందులో ప‌నిచేస్తున్న వారంతా మూగ‌, వినికిడి సమ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారే. బ‌దిర యువ‌తీయువ‌కుల్లో ఆత్మ‌విశ్వాసం పెంచి, వారిని ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో ఈ హోట‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు నిర్వాహ‌కులు పేర్కొన్నారు.  ఒక‌రినొక‌రు మాట్లాడుకోవ‌డం కోసం సంజ్ఞ‌ల భాష‌ను నేర్పించారు.  ప్ర‌స్తుతం ఈ టెర్రాసైన్ హోట‌ల్ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న‌ది. 

Read: భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… మ‌ర‌ణాలు..

Related Articles

Latest Articles