NTV Telugu Site icon

Kim Jong Un: అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది.. మాతో శత్రుత్వం మంచిది కాదు..!

Kim

Kim

Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ప్యాంగ్‌యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. యూఎస్ మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది.. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్‌ యుద్ధం వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.

Read Also: IND vs AUS: పెర్త్‌ టెస్ట్.. రోహిత్‌ శర్మ వచ్చేస్తున్నాడు!

ఇక, కొరియా ద్వీపకల్పంలో ఇప్పటి వరకు అణు యుద్ధాలు జరగలేదని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. ఇక, అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను ముందుకు వచ్చిన.. అక్కడి నుంచి సరైన రియాక్షన్ రాలేదన్నారు. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికాలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో​ 3 సార్లు కిమ్ జోంగ్ ఉన్ సమావేశం అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్‌, హనోయ్‌, కొరియా సరిహద్దుల్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినప్పటికి అవి సఫలం కాలేదు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

Read Also: Varun Tej : వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పై గాసిప్స్.. అబ్బే అలా ఏం తగ్గలే

అయితే, ఉత్తర కొరియా ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో అమెరికాలో ట్రంప్‌ అధికారం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో.. నార్త్‌ కొరియా సైన్యం అలర్ట్‌గా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ అలర్ట్ జారీ చేశారు. ఇక, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని అధికారులకు కిమ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర కొరియా అధినేత ఆర్ఢర్‌తో కొరియన్ అధికారులు అణ్వాయుధాలపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది.