NTV Telugu Site icon

North Korea: రోడ్లను పేల్చేసిన నార్త్ కొరియా.. మండిపడిన దక్షిణ కొరియా..

North Koria

North Koria

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తాను అనుకున్నదే చేశాడు. దక్షిణ కొరియాను కలిపే రహదారులను పేల్చేయించాడు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. తమ వైపు ఉన్న రోడ్లను సైన్యం కాపాడుతోందన్నారు. కిమ్‌ తన టాప్‌ మిలిటరీ, సెక్యూరిటీ అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో కిమ్‌ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా డ్రోన్ల వస్తే తీవ్రమైన కవ్వింపు చర్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని రహస్య సూచనలు చేశాడని ఆ దేశ మీడియా వెల్లడించింది.

Read Also: IPL 2025 Auction: రోహిత్‌ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్‌

ఇక, కిమ్‌ సర్కారు శతఘ్ని దళాన్ని సరిహద్దుల దగ్గరకు పంపింది. సౌత్ కొరియా డ్రోన్‌లు కనిపిస్తే వెంటనే దాడి స్టార్ట్ చేయాలని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం కిమ్‌ జోంగ్ ఉన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం నార్త్ కొరియా తీవ్రంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, 2000 సంవత్సరంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఉత్తర- దక్షిణ కొరియాల మధ్య రోడ్లను నిర్మించారు. దీంతో పాటు రెండు రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటి దగ్గర భారీ భద్రతను సైతం ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాలతో ఆ తర్వాత ఈ మార్గాలను బంద్ చేశారు.

Read Also: SSC GD: భారీ రిక్రూట్‌మెంట్.. పది పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగం

అయితే, ఈ రోడ్ల ధ్వంసంపై గత వారం నార్త్ కొరియా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం పేర్కొనింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా అమెరికా మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చింది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్‌ వెల్లడించింది.