Site icon NTV Telugu

Donald Trump: ‘‘నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు’’.. ఇరాన్‌పై దాడి గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Donald Trump

Donald Trump

Donald Trump: ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా చూసుకోవడానికి ఇరాన్‌పై సైనిక దాడిలో అమెరికా ఇజ్రాయెల్‌తో చేరుతుందా లేదా అనే దాని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. వైట్ హౌజ్‌లో విలేకరులు ప్రశ్నించగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ కావచ్చు, కాకపోవచ్చు. నేను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదు’’ అని అన్నారు. గతవారంతో పోల్చితే ఇప్పటి పరిస్థితితో పెద్ద తేడా ఉందని మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి అన్నారు.

Read Also: Gayatri Mantra: గాయత్రీ మంత్రంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. వీడియో వైరల్

ఇరాన్‌తో వైట్ హౌజ్‌లో చర్చలను ప్రతిపాదించినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చల స్వభావం, సమయం గురించి వెల్లడించలేదు. ఇరాన్‌కు ఇప్పుడు రక్షణ లేదని, ఎయిర్ డిఫెన్స్ లేకుండా పోయిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై దాడులు కొనసాగించండి అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు తాను చెప్పినట్లు వెల్లడించారు.

మంగళవారం రోజు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని, మేము కావాలనుకుంటే అతడిని చంపగలము, కానీ ప్రస్తుతానికి మేము అలా చేయమని, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని ఖమేనీ అంతే ధీటుగా తిప్పికొట్టారు. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు అని ట్రంప్‌కి వార్ని్ంగ్ ఇచ్చారు.

Exit mobile version