Site icon NTV Telugu

New Year 2026: న్యూ ఇయర్‌ 2026కు న్యూజిలాండ్ గ్రాండ్ వెల్‌కమ్..

New Year

New Year

New Year 2026: కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్‌లోని ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి.

Read Also: Nushrratt Bharuccha: “ఘోరమైన పాపం”.. నుష్రత్ భరుచూ ‘‘మహాకాల్’’ ఆలయ సందర్శనపై ముస్లింల ఆగ్రహం..

కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. ప్రపంచంలో నూతన సంవత్సర వేడుకలు తొలుత జరిగేది న్యూజిలాండ్‌లోనే. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. న్యూజిలాండ్ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలతో పాటు ఆస్ట్రేలియా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాయి. చిట్టచివరిగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసే దేశంగా అమెరికా ఉంది. నిజానికి న్యూజిలాండ్ కన్నా ముందే పసిఫిక్ దేశమైన కిరిబాటిలో మధ్యాహ్నం 3.30 గంటలకే న్యూఇయర్ వస్తుంది.

ఇండియా కన్నా ముందు, సాయంత్రం 6.30 గంటలకు ఆస్ట్రేలియా, రాత్రి 8.30 గంటలకు జపాన్, ఉత్తర, దక్షిణ కొరియాలో, రాత్రి 9.30 గంటలకు చైనా, మలేషియా, సింగపూర్, హాకాంగ్, ఫిలిప్పీన్స్, రాత్రి 10.30 గంటలకు థాయిలాండ్, వియత్నాం, కాంబోడియాలలో కొత్త సంవత్సరం వస్తుంది.

Exit mobile version