అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది. వర్జీనియా గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించగా.. న్యూజెర్సీ గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి మికి షెర్రిల్ విజయం సాధించారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఓడించిన తర్వాత స్పాన్‌బెర్గర్ వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్ సృష్టించారు.
ఇది కూడా చదవండి: Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి
ఇక న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి కంటే ఎక్కువగా భారీ గెలుపు దిశగా వెళ్తున్నారు. మమ్దానీకి ఓటు వేయొద్దని ట్రంప్ కోరారు. ట్రంప్ వ్యాఖ్యలను ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఓటర్లంతా.. మమ్దానీ వైపే మొగ్గుచూపారు. ట్రంప్ మాటలకు భయపడేది లేదని.. నగర ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత అని మమ్దానీ పేర్కొన్నారు. ఇక న్యూయార్క్ మేయర్ అభ్యర్థి ఎవరు గెలిచినా వచ్చే ఏడాదే ప్రమాణస్వీకారం ఉంటుంది. జనవరి 1, 2026న ప్రమాణస్వీకారం చేస్తారు. ఒకవేళ మమ్దానీ గెలిస్తే మాత్రం.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా రికార్డ్ సృష్టించనున్నారు.
Zohran Mamdani is running away with the NYC mayoral race. pic.twitter.com/yzYurT3VeZ
— Polymarket (@Polymarket) November 4, 2025
