Mpox: “ఎంపాక్స్ వైరస్” ముంచుకొచ్చే ప్రమాదం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..
- ఎంపాక్స్ వైరస్‌పై పరిశోధకుల వార్నింగ్..
- ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- కాంగోలో విజృంభిస్తున్న వ్యాధి..
- గర్భస్రావాలు
- పిల్లల మరణాలకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox: ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ‘‘ఎంపాక్స్(మంకీ పాక్స్)’’ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రజల మధ్య తేలికగా వ్యాపించే ఈ వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతోంది. అయితే, ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
2022లో 110 కంటే ఎక్కువ దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి వ్యాపించింది. ముఖ్యంగా స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇది ఎంపాక్స్ క్లాడ్ 2 స్ట్రెయిన్ ఈ వ్యాప్తికి కారణమైంది. ఇదిలా ఉంటే 1970లో కాంగోలో మొదటిసారిగా గుర్తించినప్పటి నుంచి క్లాడ్ 1 స్ట్రెయిన్ క్రమంగా వ్యాప్తి చెందుతోందని, ఇది ప్రాణాంతకమని రువాండా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు జీన్ క్లాడ్ ఉదాహెముకా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా ఈ వ్యాధి సంక్రమించినప్పటికీ, ఆఫ్రికాలో మాత్రం సాధారణంగా బుష్‌మీట్ తినడం వల్ల క్లాడ్ 1 వస్తోంది.
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
Read Also: Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!
కాంగోలోని కమిటుగాలో సెక్స్ వర్కర్లలో ఈ ఎంపాక్స్ వ్యాప్తి ఉంది. ఇది స్త్రీ,పురుషుల మధ్య లింగభేదం లేకుండా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. పరీక్షల్లో ఇది క్లాడ్ Ib అని పిలువబడే అసలైన జాతి యొక్క పరివర్తన చెందిన రూపాంతరం అని వెల్లడైంది. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇదే ప్రమాదకరమైన రూపాంతరంగా పరిశోధకలు చెబుతున్నారు. దక్షిణ కివు ప్రావిన్స్‌లో 1000 కంటే ఎక్కువ మందికి క్లాడ్ ఐబీ కేసులు నమోదయ్యాయి. ఒక్క కమిటుగా పట్టణంలోనే ప్రతీ వారం 20 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.
5 శాతం పెద్దలు, 10 శాతం పిల్లల్లో ఈ స్ట్రెయిన్ బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల శరీరంపై భయకరంగా పెద్ద మొత్తంలో శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. ఈ ఐబీ స్ట్రెయిన్ గర్భస్రావాలకు కారణమవుతోందని, సంతానోత్పత్తిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ఏడాది కాంగోలో ఎంపాక్స్ వల్ల మరణించిన 384 మందిలో 60 శాతం కన్నా ఎక్కువ పిల్లలే ఉన్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!