NTV Telugu Site icon

Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్

Israelgaza

Israelgaza

హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు. కొద్దిరోజులు స్వచ్ఛంద సంస్థలు ఆహారం పంపిణీ చేశాయి. అయితే కొన్ని నెలలుగా గాజాకు వెళ్లే దారులు మూసివేయబడ్డాయి. దీంతో ఆహారం అందక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆకలితో అలమటిస్తూ నరకయాతన పడుతున్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి.. ఆర్టీజీ స‌మీక్షలో సీఎం

గాజాకు వెళ్లే దారులను ఇజ్రాయెల్ మూసేయడంతో ప్రపంచ దేశాల నుంచి నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. రాజకీయ ఒత్తిడి కారణంగా ఐడీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాకు కొత్త మారాన్ని చూపెట్టింది. ఇందుకు సంబంధించిన రూట్‌ను వీడియో ద్వారా విడుదల చేసింది. ప్రస్తుతం గాజాకు దారి తెరవడంతో ఆహారం పంపిణీకి మార్గం సుగమైంది. ఇక నేరుగా స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని తీసుకెళ్లి పంపిణీ చేయొచ్చు. ఇప్పటికే గాజా వాసులు ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా రహదారి ఓపెన్ కావడంతో వారి కష్టాలు తీరే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే గాజా పట్టణం నాశనం అయింది. అలాగే హమాస్ నాయకులను కూడా అంతం చేసింది. ఇదిలా ఉంటే అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తాను వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టేలోపు.. గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. ఆ దిశగానే నెతన్యాహు ప్రభుత్వం దూసుకెళ్తోంది.

 

Show comments