China: చైనాలో వెలుగులోకి 8 రకాల కొత్త వైరస్లు.. మరో మహమ్మారిపై ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: 2019 మొదలైన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఆల్పా, బీటా, ఓమిక్రాన్ అంటూ ఇలా తన రూపాన్ని మార్చుకుని మనుషులపై దాడి చేస్తోంది. తొలిసారిగా ఈ వైరస్ చైనా నగరమైన వూహాన్ లో బయటపడింది. ఆ తర్వాత నెమ్మదిగి ప్రపంచం అంతటా వ్యాపించింది. ప్రస్తుతం కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్నా కూడా అడపాదడపా ఇది తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
Read Also: Tamil Nadu: గవర్నర్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. డీఎంకేపై బీజేపీ విమర్శలు..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇదిలా ఉంటే చైనాలోని దక్షిణ తీరంలో ఉన్న ఉష్ణమండల ద్వీపమైన హైనాన్ లో మునుపెన్నడూ చూడని కొత్తగా 8 రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో వీటిని గుర్తించారు. ఎప్పుడైనా ఇవి ఎలుకను దాటి విస్తరిస్తే మానవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచాన్ని సిద్ధం చేసే పనిలో పరిశోధకులు ఈ ఆవిష్కరణ చేశారు.
హైనాన్ లో ఎలుకల నుంచి దాదాపుగా 700 నమూనాలను శాస్త్రేవత్తలు సేకరించారు. 8 కొత్త వైరస్ లను ఇందులో కనుగొన్నారు. ఇందులో ఒకటి SARS-CoV-2, COVID-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందింది. గబ్బిలాల్లోని వైరస్‌లపై అనేక పరిశోధనలు చేసిన ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ ఈ వివరాలను వైరోలాజికా సినికా జర్నర్ లో ప్రచురించారు. ఈ వైరస్ లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్ని ఆమె పిలుపునిచ్చారు.
వైరోలాజికా సినికా అనే పత్రిక చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం) యొక్క ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్ కింద పనిచేస్తుంది. కొత్త అధ్యయనంలో 201-2021 మధ్య హైనాన్ లో పట్టుకున్న ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరించారు. వీటిని పరీక్షిస్తే CoV-HMU-1 అని పిలిచే ఒక కొత్త కరోనావైరస్తో సహా కొత్త నోవల్ వైరసెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిలో కొన్ని మానవుడి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!