Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!

  • ఫ్లైదుబాయ్ FZ1073 కాక్‌పిట్ ఘటనపై దర్యాప్తు
  • దాడి వెనుక ఉన్న వారిపై నెతన్యాహు తీవ్ర హెచ్చరిక
  • ‘‘ఎవరు బాధ్యులైనా భారీ మూల్యం చెల్లించాలి’’ అన్న నెతన్యాహు
Netanyahu

Netanyahu

Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరితో సహా దాన్ని కూల్చేయాలని చూశాడని నెతన్యాహూ చెప్పారు.

బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోన టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ కూల్చాలని అనుకున్నాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, ఫ్లైట్ కంట్రోల్స్ పూర్తిగా తీసుకోవాలని భావించాడు. అయితే, స్మిత్ ఫ్లైట్ కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో, ప్రయాణికులు వేగంగా స్పందించి, కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. చివరకు సౌదీ అరేబియాలో విమానం సురక్షితంగా ల్యాండైంది. తీవ్రగాయాలైన స్మిత్ పటేల్ ఇప్పుడు యూఏఈలో చికిత్స తీసుకుంటున్నారు.