Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం
- టర్కీకి గట్టిగా బదులిచ్చిన నెతన్యాహు
- మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతున్నాయి. ఈ ఘర్షణ ఎటువైపు దారి తీస్తుందోనని అంతర్జాతీయ నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం టర్కీ పార్లమెంట్లో ఎంపీలను అధ్యక్షుడు ఎర్డోగాన్ ఉద్దేశించి ప్రసంగించారు.. ఇజ్రాయెల్ దాడులు లెబనాన్, సిరియాలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయని.. అవి ఇప్పుడు టర్కీ భద్రతకే ప్రత్యక్ష ముప్పుగా మారాయని అన్నారు. సిరియా, లెబనాన్ భద్రతతో టర్కీ భద్రత ముడిపడి ఉందని పేర్కొన్నారు. తేకాకుండా ఆఫ్రికా దేశాలు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో అస్థిరత సృష్టించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సైప్రస్ దీవిలో కూడా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో టర్కీ లేదా టర్కిష్ సైప్రియట్ల హక్కులకు భంగం కలిగితే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌పై మరింత కఠిన వైఖరి అవలంబించాలని పిలుపునిచ్చారు. “ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి తీసుకురావడం కొన్ని దేశాల బాధ్యత మాత్రమే కాదు, మానవాళి మొత్తం బాధ్యత” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
నాటో సభ్యదేశమైన టర్కీ.. గాజా, లెబనాన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న సైనిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే టర్కీ ఇజ్రాయెల్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులకు కూడా ఇజ్రాయెల్ చర్యలే కారణమని టర్కీ ఆరోపిస్తోంది.
నెతన్యాహు కౌంటర్
ఎర్డోగాన్ వ్యాఖ్యలపై నెతన్యాహు ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఘాటైన పోస్టు చేశారు. ఎర్డోగాన్‌ను “యూదు వ్యతిరేక నియంత”గా అభివర్ణించారు. కుర్దులపై అణచివేతకు పాల్పడుతున్నారని.. హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. “నైతికత గురించి ఇజ్రాయెల్‌కు బోధించడానికి ఎర్డోగాన్ చివరి వ్యక్తి” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు మధ్యప్రాచ్యానికి, ప్రపంచానికే ముప్పుగా మారాయని పేర్కొంటూ… వాటిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కఠిన చర్యలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఇద్దరు నేతల మధ్య తాజా వ్యాఖ్యల యుద్ధం మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
The antisemitic dictator Erdoğan – who is committing genocide against the Kurds, supports the Hamas terrorist organization, oppresses his own people and imprisons political rivals – is the last person who can lecture the State of Israel on morality.
The State of Israel and the…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) June 10, 2026
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!