Site icon NTV Telugu

Netanyahu: గాజాపై యుద్ధం ముగియలేదు.. హమాస్ పాలన అంతమే లక్ష్యమన్న నెతన్యాహు

Netanyahu

Netanyahu

గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్‌తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రారంభం.. iPad, టాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్ ఇదిగో..!

ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందమే కుదిరిందని.. కానీ హమాస్ ప్రభుత్వాన్ని అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ సైనిక, పాలనా సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని వెల్లడించారు. పాలనకు హమాస్ ముగింపు పలికితేనే సమస్యకు పరిష్కారం అని.. అంతే తప్ప 60 రోజుల కాల్పుల విరమణ శాంతికి మార్గం కాదని స్పష్టం చేశారు. ఇక ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత వాషింగ్టన్‌లో చారిత్రక పర్యటన జరిగిందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత కుటుంబాలకు నెతన్యాహు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Shubhanshu shukla: భూమి మీదకు శుభాన్షు శుక్లా తిరిగి రావడం వాయిదా.. ఆరోజే వచ్చేది..!

2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి పలువురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇప్పటికే గాజాను నాశనం చేసింది. అయితే ఇటీవల ట్రంప్.. హమాస్-ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే గడువులోగా తమ డిమాండ్లు నెరవేరకపోతే తిరిగి దాడులు చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.

Exit mobile version