Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు

  • మరోసారి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న నెతన్యాహూ..
  • అమెరికా మద్దతుతో 4 నుంచి 7 రోజుల వైమానిక దాడులకు ఇజ్రాయిల్ ప్రయత్నం..
  • దాడులపై ఆచితూచి వ్యవహరిస్తు్న్న ట్రంప్..
Trump Netanyahu

Trump Netanyahu

Iran War: ఇరాన్‌తో మరోసారి యుద్ధం తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఇరాన్‌పై కొన్ని రోజుల పాటు సైనిక దాడులు నిర్వహించేందుకు అమెరికా మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నెతన్యాహూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇటీవల సీనియర్ మంత్రులు, భద్రతా అధికారులతో జరిగిన సమావేశాల్లో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయిల్ మీడియా చెప్పింది. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య అనివార్యమని నెతన్యాహూ చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయిల్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు దాడులకు సంబంధించిన ప్లాన్ పంచుకున్నట్లు, ఆమోదించినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. నెతన్యాహూ మాత్రం నాలుగు నుంచి ఏడు రోజుల పాటు వైమానిక దాడులు నిర్వహించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌పై ఆచూతూచి వ్యవహరిస్తున్న ట్రంప్..

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌పై మరోసారి దాడి చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడటం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘నేను ఏ నిర్ణయం తీసుకోవడానికి తొందరపడటం లేదు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని అన్నారు.