Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- ఆమె యూదు వ్యతిరేకి
- నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి విజేత నవీ పిళ్లైపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తీవ్ర విమర్శలు చేసింది. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని ఆరోపించిన నవీ పిళ్లైను ‘యూదు వ్యతిరేక పక్షపాతి’గా అభివర్ణించింది. ఆమెపై ‘బిగాట్’, ‘అవినీతి ప్రాసిక్యూటర్’ అంటూ విమర్శలు గుప్పించింది.
నవీ పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. నోబెల్ బహుమతి కమిటీ తన నైతిక దిక్సూచిని కోల్పోయిందని విమర్శించింది. యూదులపై తప్పుడు ఆరోపణలను సృష్టించి ప్రచారం చేయడాన్నే తన వృత్తిగా మార్చుకున్న వ్యక్తికి అత్యున్నత గౌరవాన్ని అందించిందని ఆరోపించింది. నవీ పిళ్లై తన కెరీర్ మొత్తంలో ప్రపంచంలోని ఏకైక యూదు దేశమైన ఇజ్రాయెల్‌పై తప్పుడు ప్రచారం చేశారని, యూదులను దుష్టులుగా చిత్రీకరించే ప్రయత్నాలకు పాల్పడ్డారని నెతన్యాహు కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
నవీ పిళ్లై ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు నాయకత్వం వహించారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలపై ఈ కమిషన్ గత ఏడాది నివేదిక విడుదల చేసింది. అందులో ఇజ్రాయెల్ గాజాలో ‘జెనోసైడ్’ (మారణహోమం)కు పాల్పడుతోందని నిర్ధారించినట్లు పేర్కొంది. అయితే ఈ విచారణ కమిషన్ ఐక్యరాజ్యసమితి తరఫున అధికారికంగా మాట్లాడే సంస్థ కాదని గమనించాలి. గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ వచ్చిన ఈ నివేదికలు, ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
The Nobel Prize committee has lost its moral compass. It has awarded its highest honor to a bigot who built her career around inventing and propagating blood libels against the one and only Jewish state.
Navi Pillay’s proudest achievement was to legitimize a corrupt prosecutor who turned to her fabrications against Israel hoping that by joining her bigoted lynch mob, he would beat a rape charge.
Karim Khan, who was accused by his own ICC employees of raping and sexually molesting them, used Pillay’s lies to build a fake case against Israel.
Pillay supplied the lies. Khan weaponized them. And now the misguided members of the Nobel Committee are honoring the woman who propagated this demonization of the Jews and this travesty of justice.
— Prime Minister of Israel (@IsraeliPM) October 9, 2026
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు