Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
- భోటేకోషి వరదలు, కొండచరియలతో నేపాల్–టిబెట్ సరిహద్దులో భారీ విధ్వంసం
- సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా ప్రకటన
- గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు ఉన్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్ జల ప్రళయం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భోటేకోషి నది ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు, ఇతరులు ఉన్నట్లు చెప్పింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరాలను వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వరదల్లో టిబెట్ లోని గిరాంగ్ కౌంటీ తీవ్రంగా దెబ్బతింది. చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
చైనాకు తీవ్ర నష్టం..
కొండచరియలు విరిగి పడటం, వరదలు చైనాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేపాల్-చైనా ప్రధాన భూమార్గం తీవ్రంగా దెబ్బతింది. భవనాలు బురదతో నిండిపోయాయి. కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. నేపాల్-చైనా సరిహద్దులో ఉన్న ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకర ప్రాంతాల్లోని సమీప గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
టిబెట్ లోని గిరాంగ్ సరిహద్దు పోర్టు వద్ద కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు పూర్తిస్థాయిలో గాలింపు చేపట్టాలని, చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గాయపడిన వారికి వెంటనే వైద్యం అందించాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!