NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
- ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే
- ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
- కాల్పుల విరమణ తర్వాత ఇరాన్-అమెరికా పరస్పర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడులను నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే సమర్థించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పూర్తిగా అవసరమైనవేనని వ్యాఖ్యానించారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రుట్టే.. అమెరికా చర్యలకు బహిరంగ మద్దతు ప్రకటించారు.
ఇటీవల హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య ట్యాంకర్లపై దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా మంగళవారం ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. అలాగే ఇరాన్‌కు చమురు విక్రయాలకు అనుమతిస్తున్న ప్రత్యేక లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. ఈ చర్యలతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందంపై మరింత ఒత్తిడి పెంచింది. సముద్ర మార్గంలో జరిగిన దాడులకు ఇరానే బాధ్యత వహించాలని అమెరికా ఆరోపిస్తోంది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
ఈ పరిణామాలపై స్పందించిన మార్క్ రుట్టే.. ‘‘కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో ఇరాన్ దానిని ఉల్లంఘిస్తే.. అమెరికా బలంగా ప్రతిస్పందించడం అత్యంత కీలకం. అమెరికా చేపట్టిన తాజా దాడులు పూర్తిగా సమర్థనీయమైనవే.’’ అని పేర్కొన్నారు. అయితే నాటో కూటమి మొత్తం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఇది అమెరికా స్వతంత్ర నిర్ణయమని పేర్కొంటూనే.. దానికి తాను మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నాటో ప్రధాన కార్యదర్శి నుంచి కీలక రాజకీయ మద్దతు లభించినట్లైంది. నాటోలో అమెరికా పాత్రపై వస్తున్న సందేహాలను కూడా రుట్టే కొట్టిపారేశారు. అమెరికా నాటో పట్ల పూర్తిగా కట్టుబడి ఉందని.. నాటో అమెరికా భద్రతా ప్రయోజనాలకు కూడా కీలకం అని చెప్పారు.
అదే సమయంలో యూరప్, కెనడా దేశాలకు కూడా ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. అమెరికాతో సమానంగా రక్షణ వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉందని.. ట్రంప్ చేస్తున్న డిమాండ్ సమంజసమేనని పేర్కొన్నారు. నాటో సభ్య దేశాలు రక్షణ ఖర్చులను పెంచడం అంకారా సదస్సులో ప్రధాన చర్చాంశంగా మారింది. అధికారికంగా నాటో సదస్సు అజెండాలో సమిష్టి భద్రత, రష్యా ముప్పు, దీర్ఘకాలిక రక్షణ వ్యూహాలే ఉన్నప్పటికీ.. ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు సమావేశంపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే అమెరికా చర్యలకు మద్దతు ఇవ్వని కొన్ని మిత్రదేశాలను ట్రంప్ బహిరంగంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు రక్షణ వ్యయాలను పెంచేందుకు సిద్ధపడటం ద్వారా అమెరికాతో నెలకొన్న విభేదాలు తగ్గుతాయా లేదా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు తూర్పు, దక్షిణ సరిహద్దుల్లో కొనసాగుతున్న యుద్ధాలు, భద్రతా సంక్షోభాల మధ్య నాటో కూటమి ఐక్యతను కొనసాగించడం కూడా సంస్థకు పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Reporter: What is your reaction to the recent U.S. attacks on Iran?
NATO's Rutte: I think it was absolutely necessary. Iran is violating the ceasefire. pic.twitter.com/kd6Nr9Dtwx
— Clash Report (@clashreport) July 8, 2026
CENTCOM just released this statement:
"U.S. Central Command (CENTCOM) forces completed a new round of offensive strikes against Iran, July 7, hitting over 80 targets with precision munitions as an immediate response to Iran's latest attacks on commercial vessels transiting the… pic.twitter.com/6vQDRBNpO5
— AZ Intel (@AZ_Intel_) July 8, 2026
- Tags
- Donald Trump
- Iran
- Mark Rutte
- NATO
- us
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?